మూసి పరివాహక ప్రాంతంలో ప్రజలు ఖాళీ చేసిన ఇళ్ల కూల్చివేత

మూసి రివర్బెడ్ శంకర్ నగర్ లోని ఇళ్ళ కూల్చివేతని అధికారులు చేపట్టారు.

హైదరాబాద్ : మలక్పేట్ పరిధిలోని శంకర్ నగర్ మూసి రివర్ పేటలో స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసిన ప్రజలకు మౌలిక వసతులు కల్పించి నిర్వాసితుల సామాగ్రి తరలింపుకు వాహనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల యొక్క ఇళ్ల కూల్చివేత అధికారులు ప్రారంభించారు.నిర్వాసితుల యొక్క సామాగ్రి తరలింపుకు వాహనాలు ఏర్పాటు చేసి రెండు పడక గదుల ఇళ్లకు వీరిని తరలిస్తున్నారు.

 ఇంకొక వైపు దీని సమీపంలోనే అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ తులసి రామ్ నగర్ లో మూసి పరివాహక ప్రాంత వాసులను బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించనున్నారు. ఇట్టి కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే కారు వెంకటేష్ స్పందిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు.

Tags: