రోజుకు 50 వేల కూలి కోసం గంజాయి రవాణాకు అంగీకరించిన డ్రైవర్...... అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు
రోజుకు 50 వేల కూలి కోసం గంజాయి రవాణాకు అంగీకరించిన డ్రైవర్ కటకటాల పాలయ్యాడు.
కొత్తగూడెం: రోజుకు 50 వేల కూలి కోసం గంజాయి రవాణాకు అంగీకరించిన డ్రైవర్ కటకటాల పాలయ్యాడు
ఒడిశా నుంచి కర్ణాటకలోని హుమ్నాబాద్ కు గంజాయి రవాణా చేసేందుకు జహీరాబాద్ కు చెందిన డ్రైవర్ మహమ్మద్ షరీఫ్ ను ముంబైకి చెందిన గంజాయి స్మగ్లర్ యూసఫ్ సాహిద్ ఖాన్ అద్దెకు తీసుకున్నాడు స్మగ్లర్ సూచన మేరకు డ్రైవర్ ఒడిశా వెళ్లి రూ.2.20 లక్షలు చెల్లించి 130.7 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు
పక్కా సమాచారం మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సోమవారం భద్రాచలంలోని కూనవరం చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు
అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ (ఏఈఎస్) తిరుపతి స్టేట్ టాస్క్ ఫోర్స్ (యస్టీయఫ్) సీఐ శ్రీనివాస్ మరియు బృందం కారులో గంజాయి తరలిస్తుండగా షరీఫ్ ను పట్టుకున్నారు
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 37.60 లక్షలు ఉంటుందని అంచనా వేసారు..
షరీఫ్ ఫై,షాహిద్ ఖాన్ పై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ( ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ) వి బి కమలహాసన్ రెడ్డి అభినందించారు
CALENDER - 19-01-2026 09:16:55 PM
| Sun | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
|---|