11 జిల్లాల్లో రెడ్ అలర్ట్...ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు రానున్న రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరిచ్చింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల వలన ఏ విధమైన ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగరత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ అండ్ బీ యంత్రంగాన్ని ఆ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అప్రమత్తం చేసారు.అదే విధంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.