ఆసుపత్రిలో చేరిన బీ ఆర్ యస్ ఎమ్మెల్సీ కవిత

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరార. వైద్య పరీక్షల కోసం ఆమె చేరినట్లు భారత రాష్ట్ర సమితి వర్గాలు తెలిపాయి..

హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు  కవిత నగరంలోని ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం ఆమె ఆసుపత్రిలో చేరినట్లు భారత రాష్ట్ర సమితి వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు తీహార్ జైల్లో ఉన్నప్పుడు కవితకు గైనిక్ సమస్యలు వచ్చాయి. ఆ సమయంలోనే ఆమె చికిత్స కూడా తీసుకున్నారు. నేడు కూడా అదే సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. నేటి సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి కానున్నాయి.

Tags: